ఎల్‌1కు చేరువలో ఆదిత్య : ఇస్రో చైర్మన్‌

25 Nov, 2023 15:46 IST|Sakshi

తిరువనంతపురం: సూర్యున్ని అధ్యయనం చేయడానికి నింగిలోకి వెళ్లిన వ్యోమనౌక ఆదిత్య ఎల్‌-1ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 7కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్‌ 1 పాయింట్‌ చేరుకునేందుకు కావల్సిన తుది ఏర్పాట్లు పూర్తవుతాయని చె​ప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్‌ ఆదిత్య ఎల్‌1 అ‍ప్డేట్స్‌ను వెల్లడించారు. 

‘ఆదిత్య మిషన్‌ గమ్యాన్ని చేరుకునేందుకు అతి దగ్గరలో ఉంది. ఎల్‌ 1 పాయింట్‌కు వెళ్లేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నాం’ అని సోమనాథ్‌ తెలిపారు.సెప్టెంబర్‌ 2న ఆదిత్య ఎల్‌1 ను శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆదిత్య స్పేస్‌ క్రాఫ్ట్‌ సూర్యునికి అతి సమీపంలో ఉన్న లాంగ్రేజియన్‌ పాయింట్‌(ఎల్‌-1)ను చేరుకునే లక్ష్యంతో పంపించారు. ఎల్‌-1పాయింట్‌ చేరకున్న తర్వాత అక్కడి నుంచి ఆదిత్య సూర్యుని చిత్రాలు తీసి భూమికి పంపనుంది. ఇవి సూర్యున్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంలో ఇస్రోకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. 

ఇదీచదవండి..తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ  

మరిన్ని వార్తలు