-

అగ్నిపథ్‌ స్కీమ్‌పై ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

21 Jun, 2022 20:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్నిపథ్‌ స్కీమ్‌ను కేంద్ర వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ వల్ల భారత ఆర్మీ బలహీనపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ తలదూర్చదని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంపై జరిగిన సమావేశానికి శరద్‌పవార్‌ తనకు ఫోన్‌ చేసి ఆహ్వానించారు. అయితే పవార్‌ ఆహ్వానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ పాత్ర తక్కువ అంచనా వేయొద్దు అని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.

చదవండి: (ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..?)

మరిన్ని వార్తలు