-

విదేశాల్లో పెళ్లిళ్ల ట్రెండ్‌: ప్రధాని మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు

26 Nov, 2023 13:46 IST|Sakshi

న్యూఢిల్లీ: డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ట్రెండ్‌పై ప్రధానమంత్రి నరేంద​ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 107వ మన్ కీ బాత్ ద్వారా ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 26/11ఉగ్రదాడి మృతులకు,అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే ఈ సందర్బంగా ప్రజలకు కొన్ని కీలక విజ్ఞప్తులు చేశారు.

ముంబై ఉగ్రదాడి: 2008 నవంబర్ 26వ తేదీ ముంబై ఉగ్రదాడికి  నేటికి 15 ఏళ్లు. దాదాపు 60 గంటలకు పైగా సాగిన ఉగ్రవాదుల  మారణకాండలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది మరణించారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి.  విచారణ అనంతరం ఈ కేసులో  కసబ్‌కు  ఉరిశిక్ష అమలైంది.

దీపావళి రోజున వస్తువుల కొనుగోలుకు నగదు వినియోగం వరుసగా రెండో ఏడాది తగ్గిందని  ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు నగదును ఉపయోగించకూడదని, డిజిటల్ చెల్లింపులను మాత్రమే ఉపయోగిస్తామనే ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఒక నెల తర్వాత ప్రజలు తమ సెల్ఫీలను పంచుకోవాలని ఆయన కోరారు. ప్రజలు స్థానిక ఉత్పత్తులకే మొగ్గు చూపాలని, భారతీయ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రధాని  కోరారు. భారతీయ ఉత్పత్తుల పట్ల సెంటిమెంట్ కేవలం పండుగలకే పరిమితం కాకూడదన్నారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కొన్ని వ్యాపార సంస్థలు అంచనా వేస్తున్నాయనీ, పెళ్లి షాపింగ్‌లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలను కోరారు.

 విదేశాల్లో పెళ్లిళ్లు అవసరమా? ఆలోచించండి!
ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దేశంలో జరిగే పెళ్లిళ్లు, దానికి సంబంధించిన వ్యయాలు భారత ఆర్థిక వ్యవస్థ  వృధ్దిలో కీలక పాత్రను గుర్తు చేశారు.  భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇటీవలి కాలంలో పెరుగుతోందని, ఇది అవసరమా?  అని మోదీ ప్రశ్నించారు. అంతేకాదు ‘‘పెళ్లిల సంగతి అటుంచితే.. చాలా కాలంగా నన్ను ఇబ్బంది పెడుతోంది, నా మనసులోని బాధను కుటుంబ సభ్యులతో చెప్పకపోతే ఎవరికి చెప్పుకోవాలి? అంటూ   విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే ట్రెండ్‌ మారాలని  ప్రధాని  సూచించారు. ఈ గడ్డపై పెళ్లి  చేసుకుంటే, ఆ డబ్బంతా  దేశంలోనే ఉంటుంది.  తద్వారా మీరు మీ దేశానికి, దేశంలోని పేదవారికి కూడా సేవ చేసిస అవకాశం పొందుతారని వ్యాఖ్యానించారు.  (రాయల్‌ లైఫ్‌, అంబానీ కంటే రిచ్‌ : ఇపుడు అద్దె ఇంట్లో దుర్భరంగా..!)

ఇది ఇలా ఉంటే గతంలో (మార్చి) కూడా  “డెస్టినేషన్ వెడ్డింగ్‌లు టూరిజానికి భారీ  అవకాశాల్ని కల్పిస్తాయని, మన దేశంలోని  ధనవంతులు విదేశాలకు వెళతారు కానీ ఇప్పుడు మధ్యతరగతి ,ఎగువ మధ్యతరగతి వారు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం విదేశాలకు  వెళుతున్నారని వ్యాఖ్యానించారు.  ‘డెవలపింగ్ టూరిజం ఇన్ మిషన్ మోడ్’ అనే అంశంపై మాట్లాడిన మోదీ ఆయా రాష్ట్రాలు  ప్రత్యేక  ప్యాకేజీలు కల్పించాలని  సూచించారు.  డెస్టినేషన్ వెడ్డింగ్‌లు టూరిజానికి భారీ అవకాశాలు కల్పిస్తాయన్నారు.
 

మరిన్ని వార్తలు