Delhi: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

2 Dec, 2023 08:29 IST|Sakshi

ఢిల్లీ వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ (మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించే ఉష్ణమండల తుఫాను)కారణంగా ఇక్కడి వాతావరణంలో వేడి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అదే సమయంలో వాయు కాలుష్య స్థాయిలో కూడా ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. 

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. ఇక్కడి ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 388, అశోక్ విహార్‌లో 386, లోధి రోడ్‌లో 349, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఏక్యూఐ 366గా నమోదయ్యింది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎండీ)లో శనివారం ఉదయం ఒక మోస్తరు పొగమంచు నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

నవంబర్ 28 అనంతరం గాలి నాణ్యత కొద్దిగా మెరుగుపడింది. నవంబర్ 2 నుంచి కాలుష్య నివారణ చర్యలు చేపట్టిన దరిమిలా గాలి నాణ్యతలో మెరుగదల చోటుచేసుకుంది. అనవసరమైన నిర్మాణ సంబంధిత కార్యకలాపాలు  నిషేధించడం, కాలుష్య కారక వాహనాలు రోడ్లపైకి రావడాన్ని నిషేధించడంతో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టింది. 
ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం

మరిన్ని వార్తలు