అరెస్టయిన ఢిల్లీ మంత్రి ఇంట్లో రూ. 2 కోట్ల నగదు, బంగారు నాణేలు

7 Jun, 2022 18:36 IST|Sakshi

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సత్యేందర్‌ పై ఉన్నమనీలాండరింగ్ కేసులో భాగంగా ఆయని నివాస ప్రాంతాల్లో ఈడీ సోమవారం సోదాలు నిర్వహించింది. దర్యాప్తు సంస్థ ఆ సోదాల్లో సుమారు రూ. 2 కోట్లకు పైగా నగదు, 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. 
అంతేకాదు ఆ రూ.2 కోట్ల నగదును ఎస్ రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ లిమిటెడ్ ఆవరణలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

 పైగా రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ లిమిటెడ్‌కి డైరెక్టర్లుగా వైభవ్ జైన్, అంకుష్ జైన్, నవీన్ జైన్‌లు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. సత్యేందర్‌ని కోల్‌కతా కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్‌లో రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసి అరెస్టు చేసిన సంగతి విధితమే. దీంతో సత్యేందర్‌ జైన్‌ని జూన్‌1 నుంచి వరకు దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉన్నారు.

సత్యేందర్‌ వాటాదారుగా ఉన్న నాలుగు కంపెనీలకు వచ్చిన నిధుల మూలాన్ని వివరించలేకపోయారని ఆరోపించింది. ఆయన ఢిల్లీలో అనేక కంపెనీలను కొనుగోలు చేయడమే కాకుండా వాటి ద్వారా సుమారు రూ. 16. 39 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చకున్నారంటూ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఐతే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాత్రం అవన్నీ అబద్ధాలని, ఢిల్లీ అభివృద్ధి చూడలేక చేస్తున్న దాడులంటూ ప్రధాని నరేంద్ర మోదీ పై విరుచకుపడుతున్నారు.

(చదవండి:  నెక్ట్స్‌ టార్గెట్‌ సిసోడియానే: కేజ్రివాల్‌)

మరిన్ని వార్తలు