బ్రిటిష్‌ వైశ్రాయ్‌లా చేయకండి.. ఎల్జీ సక్సేనాపై కేజ్రీవాల్‌ ఫైర్‌

17 Jan, 2023 18:45 IST|Sakshi

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. తమ ప్రభుత్వ కార్యకలాపాలకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా అడ్డుపడుతున్నారని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సీరియస్‌ అయ్యారు. ఈ క్రమంలో ఎల్జీ వినయ్‌ కుమార్‌ సక్సేనాను బ్రిటిష్‌ వైస్రాయ్‌తో పోల్చారు కేజ్రీవాల్‌. దీంతో, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. 

అయితే, రెండు రోజులుగా ఢిల్లీ అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో​ ఎల్జీ సక్సేనా.. టీచర్ల శిక్షణకు సంబంధించిన ఫైనల్‌ తాము పంపితే తిరస్కరించారని అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఎల్జీ పడుతున్నాడని కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల టీచర్‌లను శిక్షణ కోసం ఫిన్‌లాండ్‌కు పంపించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ఎల్జీ అందుకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో రెండు కోట్ల జనాభా ఉన్నదని, వారిలో లక్షల మంది చిన్నారులు ఉన్నారు. వారికి మంచి విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎల్జీ అడ్డుపడాల్సిన అవసరం ఏమున్నదని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. టీచర్లకు ఫిన్‌లాండ్‌లో శిక్షణకు సంబంధించిన ఫైల్‌ను ఎల్జీ దగ్గరకు పంపిస్తే ఆయన తిరస్కరించారని సభకు చెప్పారు.

ఇదే సమయంలో బ్రిటిష్‌ పాలకుల నియంతృత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు దేశ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చింది. ప్రస్తుతం తాము కూడా ఎల్జీ పోరాటం చేస్తున్నామని అన్నారు. సక్సేనా.. బ్రిటిష్‌ వైస్రాయ్‌లా వ్యవహరించవద్దని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్జీకి మా నెత్తిన కూర్చునే అధికారం లేదని మండిపడ్డారు. తన వల్లే ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు వచ్చాయని చెబుతున్నారని అన్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని కేజ్రీవాల్‌ హితవు పలికారు. 
 

మరిన్ని వార్తలు