ప్రయాగ్‌రాజ్‌లో అసద్ అంత్యక్రియలు.. తండ్రి అతిఖ్‌ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ..

15 Apr, 2023 11:54 IST|Sakshi

లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ అంత్యక్రియుల ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగాయి. ఉమేష్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల అసద్‌ను యూపీ స్పెషల్ టాస్క్‌ ఫోర్స్ పోలీసులు ఝాన్సీలో గురువారం ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. అసద్‌తో పాటు అతని అనుచరుడ్ని కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

అనంతరం అసద్ భౌతికకాయాన్ని పోలీసులే ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు. అంత్యక్రియల్లో అతికొద్ది మంది బంధువులే పాల్గొన్నారు. కాగా.. తన కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అ‍నుమతి ఇవ్వాలని అతిఖ్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్‌ కోర్టును కోరగా అతనికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం అందుకు నిరాకరించింది.  దీంతో కుమారుడిని కడసారి చూసుకోలేకపోయానని అతడు మనోవేధనకు గురైనట్లు తెలుస్తోంది.

ఉమేష్ పాల్ హత్య అనంతరం అసద్ 50 రోజులు పరారీరో ఉన్నాడు. అయితే తన తండ్రిని పోలీసులు అహ్మదాబాద్‌ నుంచి ప్రయాగ్‌రాజ్ తరలిస్తున్నారని తెలిసి అతడ్ని తప్పించేందుకు ప్లాన్ చేసి దొరికాడు. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్‌పై దాడికి కుట్ర.. అసద్ ఎన్‌కౌంటర్‌కు ముందు ఇంత జరిగిందా?

మరిన్ని వార్తలు