Autorickshaw Blast: నడిరోడ్డుపై పేలిపోయిన ఆటో.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

20 Nov, 2022 17:20 IST|Sakshi

మంగళూరు: కర్ణాటకలో ఆటో రిక్షా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మరోక వ్యక్తి ఆధార్‌ కార్డుని వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. ఆ ప్రయాణికుడు తమకూరు డివిజన్‌కి చెందిన రైల్వేలో పనిచేస్తున్న ప్రేమరాజ్‌ హుటాగి అనే వ్యక్తి ఆధార్‌ కార్డుని ఉపయోగిస్తున్నాడుని చెప్పారు. సదరు వ్యక్తి గతేడాది రెండుసార్లు తన ఆధార్‌కార్డుని పోగొట్టుకున్నాడుని చెప్పారు. కానీ అతను కచ్చితంగా  ఎక్కడో పోగొట్టుకున్నది చెప్పలేదని అన్నారు.

ఈ మేరకు సదరు రైల్వే ఉద్యోగి మాట్లాడుతూ..." తనకి సుమారు రాత్రి 7.30 గంటలకి పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ నుంచి ఫోన్‌ వచ్చించి. మీరు ఎక్కడ ఆధార్‌ కార్డుని పోగొట్టుకున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల గురించి తన గురించి ఆరా తీశారు. అన్ని విషయాలు వివరంగా చెప్పిన తర్వాత ఆ ఆటో రిక్షా పేలుడు ఘటన గురించి చెప్పారు. తనకు పోలీసులు చెప్పేంత వరకు కూడా ఈ ఘటన గురించి తనకు తెలియదని చెబుతున్నాడు. ఐతే తన ఆధార్‌ కార్డు పోయిందనేది వాస్తవమే గానీ మంగళూరులో తాను పోగొట్టుకోలేదని చెబుతున్నాడు. తన ఆధార్‌ కార్డు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, మరో ఆధార్‌ కార్డుని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలిపాడు. ఇలా తన ఆధార్‌కార్డు మిస్‌యూజ్‌ అవుతుందని తనకసలు తెలియదని" చెబుతున్నాడు.

ఇదిలా ఉండగా. ...ఈ ఆటో రిక్షా బ్లాస్ట్‌కి కారణం ఆ ప్రయాణికుడేనని, అతనే నిందితుడని కర్ణాటక డైరెక్టర్‌ జనరల్‌ పోలీస్‌ ప్రవీణ్‌ సూద్‌ తేల్చి చెప్పారు. ఆ ఆటోలో ప్రయాణికుడు బ్యాటరీలు అమర్చిన కుక్కర్‌ని వెంట తీసుకువె‍ళ్లాడని చెప్పారు. అందువల్ల ఈ పేలుడు సంభవించి, ఆ డ్రైవరు ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. అలాగా ఆ ప్రయాణికుడు నకిలీ ఆధార్‌ కార్డుతో, నకిలీ అడ్రస్‌, నకిలీ పేరుతో చెలామణి అవుతున్నాడని చెప్పారు. ఇది అనుకోని ప్రమాదం కాదని పెద్ద ఎత్తున నష్ట కలిగించేలా ప్లాన్‌ చేసిన ఉగ్రవాద చర్యేనని చెబుతున్నారు.

ఈ మేరకు రాష్ట్ర పోలీస్‌ చీఫ్‌ ఈ ఘటనసై రాష్ట్ర పోలీసుల తోపాటు కేంద్ర సంస్థలు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కేంద్ర నిఘా సంస్థలు సహకరిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సదరు నిందితుడు కోయంబత్తూర్‌లో తప్పుడు పేరుతో సిమ్‌ తీసుకున్నట్లు చెప్పారు. అతని కాల్‌ డేటా ఆధారంగా తమిళనాడు అంతటా పర్యటించాడని చెప్పారు.  తమిళనాడులో అతను ఎవరెవర్నీ కలుసుకున్నాడు, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

(చదవండి: రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు)

మరిన్ని వార్తలు