బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స..

29 Jul, 2023 19:41 IST|Sakshi

కలకత్తా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని ఈ రోజు మధ్యాహ్నం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారు.

'ప్రస్తుతం ఆయన కండీషన్ విషమంగా ఉంది. ఆక్సిజన్ స్థాయిలు 70కి పడిపోయాయి. దీంతో ఆయన సృహలో లేరు. అనంతరం ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స కొనసాగిస్తున్నాం.' అని వైద్యులు తెలిపారు.  

2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య.. గత కొంతకాలంగా ఆనారోగ‍్యం బారిన పడ్డారు. సీఓపీడీ సమస్యతో పాటు పలు వయస్సు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సీపీఐఎమ్‌ పాలిటీబ్యూరోతో పాటు సెంట్రల్ కమిటీ నుంచి కూడా ఆయన 2015లో తప్పుకున్నారు. రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి 2018లో తన సభ్యత్వాన్ని వదులుకున్నారు.  ఆయన భార్య మీరా భట్టాచార్య, కూతురు సుచేతన భట్టాటార్య ఆస్పత్రికి వచ్చారు. 

ఇదీ చదవండి: Lalu Prasad Yadav: అనారోగ్యం నుంచి కోలుకున్న లాలూ.. బ్యాడ‍్మింటన్ ఆడుతూ..

మరిన్ని వార్తలు