బెంగళూరు పోలీసుల ‘పూజాగిరి’

24 May, 2021 20:03 IST|Sakshi

బడితే పూజకు బదులు కొత్త పూజ

హారతి, అక్షింతలతో కొత్తరకం ట్రీట్‌మెంట్‌


బెంగళూరు: లాక్‌డౌన్‌ విధించినా రోడ్లపైకి జనాలు వస్తూనే ఉన్నారు. వారిని కంట్రోల్‌ చేయడానికి పోలీసులు నానా యాతనలు పడుతూనే ఉన్నారు. బండ్లను సీజ్‌ చేస్తున్నారు, జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని చోట్ల బడితే పూజ కూడా చేస్తున్నారు. అయినా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని అరికట్టడం కష్టంగా మారింది. దీంతో కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వారికి గాంధీగిరి తరహాలో కొత్త  రకం ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు బెంగళూరు పోలీసులు. దీనికి నెటిజన్లు పూజాగిరిగా పిలుస్తున్నారు.

బడితే పూజ కాదు
బెంగళూరు నగర శివార్లలో ఉన్న మదనయాకనహళ్లి పోలీసులు చిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో అనవసరం కారణంతో రోడ్లపైకి వచ్చినట్టు తేలగానే వెంటనే యాక‌్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి ఒకరు వచ్చి మెడలో దండ వేస్తారు. ఆ షాక్‌ నుంచి తేరుకోగానే మరొకరు హారతి పళ్లెంతో ఎదురై బొట్టు పెట్టేస్తారు. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోగానే అంక్షితలు వేసి హారతి ఇస్తున్నారు. మొత్తంగా అనవసరంగా బయటకు రావొద్దంటూ బడితే పూజకు బదులు నిజం పూజలు చేస్తున్నారు. ఒపికగా లాక్‌డౌన్‌ ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ఇంట్లోనే ఉండాలంటూ నచ్చచెబుతున్నారు. పోలీసులు చేస్తున్న ఈ పూజకు సంబంధించిన వీడియో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. 

మరిన్ని వార్తలు