రిపబ్లిక్‌ డే టా‍ర్గెట్‌గా భారీ కుట్ర.. దేశ రాజధానిలో బాంబు కలకలం

14 Jan, 2022 17:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీలో గుర్తుతెలియని దుండగులు బాంబును అమర్చారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది. స్థానిక ఘాజీపూర్‌ ఫ్లవర్‌ మండీలో ఒక బ్యాగ్‌ ఉండటాన్ని స్థానికులు గమనించారు. చాలాసేపటి నుంచి బ్యాగ్‌ మార్కెట్‌లోనే ఉండటంతో అనుమానంతో.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,  నేషనల్‌సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక పరికంతో  బ్యాగ్‌ స్కాన్‌ చేసి పరిశీలించారు.

ఆ బ్యాగ్‌లో పేలుడు పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రత దళాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో 3 కిలోల ఐఈడీ పేలుడు పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత.. ఒక రోబో సహయంతో ఆ బ్యాగ్‌ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో ఎనిమిదడుగుల లోతులో ఆ పరికరంను ఉంచి బాంబ్‌ను నిర్వీర్యం చేశారు. నేషనల్‌ సెక్యురీటి గార్డు అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ముప్పుతప్పింది. ఇంకా ఎక్కడైన బాంబులు ఉన్నాయా.. అన్న కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. 

ఫ్లవర్‌ మండీ మార్కెట్‌ భోగి పండుగ నేపథ్యంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు చేపట్టిన దీక్షా స్థలం కూడా ఘాజీపూర్‌ మండీకి సమీపంలోనే ఉంది. గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందే బాంబు ఘటన వెలుగుచూడటంతో నేషనల్‌ సెక్యూరిటీ గార్డు సిబ్బంది, స్థానిక పోలీసులు అ‍ప్రమత్తమయ్యారు. ప్రస్తుతం డీసీపీ ప్రమోద్‌ కుష్వాహ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది.  ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హై అలెర్ట్‌ కొనసాగుతుంది. 

చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు

మరిన్ని వార్తలు