వీడియో:ఒక్కసారిగా రోడ్డును ముంచెత్తిన వరద.. బస్సు బోల్తా.. చావు అంచుల దాకా..

10 Jul, 2023 17:51 IST|Sakshi

Floods Video viral: ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. కనీసం మోకాళ్ల లోతులో నీట మునిగిన ప్రాంతాల దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కళ్ల ముందే.. కొండ చరియలు విరిగిపడడం,  వాహనాలు.. ఇళ్లు.. పెద్ద పెద్ద భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తున్నాం.  ఈ క్రమంలో హర్యానా వద్ద జరిగిన ఓ రెస్క్యూ ఆపరేషన్‌ వార్తల్లోకి ఎక్కింది. 

హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి హర్యానాకు వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు.. అంబాలా-యమునానగర్‌ రోడ్డు వద్ద హఠాత్తుగా వరద పోటెత్తడంతో ఆ ఉధృతికి బోల్తా పడింది.  దీంతో ప్రయాణికులంతా బోల్తా పడిన బస్సు భాగంపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూశారు.  

వరద క్రమక్రమంగా పెరుగుతుండడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈలోపు అధికారులు ఓ భారీ క్రేన్‌ తీసుకొచ్చి.. దాని సాయంతో వాళ్లను కాపాడగలిగారు. మొత్తం 27 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా బయటకు తీసుకొచ్చారు.

అంబాలా నగర్‌లో వరద నీటిలో ఓ మొసలి సంచరిస్తున్న వీడియో సైతం నెట్‌లో కనిపిస్తోంది. ఇది అక్కడిదేనా అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. 

మరోవైపు ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి దృశ్యం ఒకటి కనిపించగా.. ప్రాణాల కోసం బస్సుపైనుంచి ప్రయాణికులు కొందరు కిందకు దూకేశారు. 

మరిన్ని వార్తలు