ఏపీకి విద్యుత్‌ బకాయిలు చెల్లించండి: తెలంగాణకు కేంద్రం ఆదేశం

29 Aug, 2022 20:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 రోజుల్లోగా విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని కేంద్రం తమ ఆదేశాల్లో పేర్కొంది.

విభజన తర్వాత 2014-2017వరకూ తెలంగాణ డిస్కంలకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌కు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రూ. 3,441 కోట్ల ప్రిన్సిపల్‌ అమౌంట్‌, రూ. 3,315 కోట్ల లేట్‌ పేమెంట్‌ సర్‌ చార్జీలు చెల్లించాలి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిలో ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు