భార్య నల్లగా ఉందని విడాకులు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

22 Dec, 2023 15:40 IST|Sakshi

రాయ్‌పూర్‌: చర్మరంగుపై ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనుషుల చర్మ రంగు విషయంలో మానవ ధృక్పథం మారాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో భార్య నలుపు రంగులో ఉందని చెబుతూ ఓ వ్యక్తి విడాకుల దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2005లో వివాహమైన సదరు వ్యక్తి విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా తన భార్య తనను విడిచి వెళ్లినట్లు భర్త వాదించాడు. అయితే తన నలుపు రంగు కారణంగ భర్త వేధింపులకు గురిచేసినట్లు, ఇంటి నుంచి గెంటేసినట్లు భార్య తెలిపింది. దీంతో ఆమె తరపున నిలిచిన న్యాయస్థానం భర్తకు చివాట్లు పెట్టింది. ఈ కేసులో తీర్పు ద్వారా ఇతరులు కూడా చర్మ రంగు ఆధారంగా ఎంపిక చేసుకునే మనస్తత్వాన్నిప్రోత్సహించలేమని జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ దీపక్ కుమార్ తివారీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 

చర్మ రంగు ఆధారంగా వివక్షను నిర్మూలించాలని పిలుపునిచ్చింది. చర్మం రంగు ప్రాధాన్యతను ప్రోత్సహించలేమని  పేర్కొంది. వివాహ సమయంలో భాగస్వామ్యుల ఎంపికవ విషయంలో చర్మం రంగు ప్రాధాన్యత, ఫేయిర్ నెస్ క్రీములపై జరిగిన లోతైన అధ్యయనాలను కోర్టు ప్రస్తావించింది. ముదురు రంగు చర్మం గల(మహిళలు) వారిని తక్కువగా చూపించడం, చర్మాన్ని కాంతివంతం చేసే సౌందర్య సాధనాలలో ఎక్కువ భాగం మహిళలను లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపింది.

తక్కువ రంగు చర్మం కలిగిన స్త్రీలను తక్కువ కాన్ఫిడెంట్‌గా చూపించే ప్రయత్నం చేయడంతో పాటు జీవితంలో సక్సెస్ అవ్వలేరని చూపించే వారని  కోర్టు పేర్కొంది. కాబట్టి నల్లటి రంగు కంటే ఫెయిర్ స్కిన్‌కి ప్రాధాన్యత ఇవ్వాలనే సమాజం మనస్తత్వం మారాలని కోర్టు తెలదిపింది. ఈ కేసులో భర్త విడాకులను ఆమోదించలేమని కోర్టు చెప్పింది.

>
మరిన్ని వార్తలు