భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..?

19 May, 2023 12:19 IST|Sakshi

న్యూఢిల్లీ: మధ్య హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన చేపల ఓడ మునిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు నావికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఓడలోని మిగతా 37 మంది నావికులను కాపాడేందుకు భారత నేవీ రంగంలోకి దిగి సాయం చేసింది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని చైనాకు ఆపన్నహస్తం అదించింది.

దీంతో భారత్‌ సహా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని తమ వంతు సాయం అందించించిన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవ్‌కు చైనా విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో సాయం చేసినందుకు ప్రశంసల వర్షం కురిపించింది.

చైనాకు చెందిన లుపెంగ్ యువాన్యు 028 చేపల ఓడ మంగళవారం హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఇందులో మొత్తం 39 మంది నావికులు ఉన్నారు. వీరిలో చైనాకు చెందన వారు 17 మంది, ఇండోనేషియాకు చెందినవారు 17 మంది, ఫిలిప్పైన్స్‌కు చెందిన ఐదుగురు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

చైనాకు చెందిన 10 ఓడలు ఆ ఆపరేషన్‌లో భాగమయ్యాయి. ఇంకా మరిన్ని ఓడలను ఘటనా స్థలానికి చేర్చుతున్నారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఓడను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

చదవండి: అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్‌కు అతిపెద్ద విజయం.. ‘రాణాను అప్పగించండి’

మరిన్ని వార్తలు