ఆన్సర్‌షీట్ల చోరీ కేసు.. పరారీలో సీఐ

11 Jun, 2021 16:35 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: మైసూరు వర్సిటీ ఆన్సర్‌షీట్ల చోరీ కేసులో మండి పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నారాయణస్వామితో పాటు మరో ఆరు మందిపై క్రిమినల్‌ కేసు దాఖలైంది. ఇది తెలిసి సీఐ పరారయ్యారు. మైసూరు వర్సిటీ ఉద్యోగి మహమ్మద్‌ నిసార్, కాంట్రాక్టు ఉద్యోగి రాకేశ్, విద్యార్థులు చందన్, చేతన్, బ్లూ డైమండ్‌ లాడ్జీ యజమానిపై కేసు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 15, 17న పీజీ కోర్సు రసాయన శాస్త్రం పరీక్ష జరిగింది.

ఆ తర్వాత మహమ్మద్‌ నిసార్, రాకేశ్‌లు కొందరు విద్యార్థుల సమాధాన పత్రాలను ఎత్తుకెళ్లి బ్లూ డైమండ్‌ లాడ్జీలో ఆ సమాధాన పత్రాలను ఆయా విద్యార్థులకు ఇచ్చి మళ్లీ పరీక్ష రాయించారు. లాడ్జీపై దాడి చేసిన సీఐ నారాయణస్వామి కేసు బయటకు రాకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని బేరం పెట్టారు. ఈ తతంగంపై జూన్‌ 9న సోమసుందర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మైసూరు నగర పోలీసు కమిషనర్‌ చంద్రగుప్తా విచారణకు ఆదేశించారు. సీఐ పరారు కావడం చర్చనీయాంశమైంది.

చదవండి: ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై బీజేపీ చెక్‌!

మరిన్ని వార్తలు