దావణగెరెలో మిస్సి కాటు బాలిక మృత్యువాత  

4 Jul, 2021 09:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బనశంకరి(కర్ణాటక): కరోనా సంబంధ మిస్సి జబ్బుతో ఐదేళ్ల బాలిక దావణగెరెలో మృతిచెందింది. దావణగెరె జిల్లా కలెక్టర్‌ మహంతేశ్‌ బీళగి తెలిపిన వివరాల మేరకు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చిత్రదుర్గ నుంచి తీసుకొచ్చిన బాలిక చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున చనిపోయింది. దావణగెరెలో మొత్తం 10 మిస్సి కేసులు నమోదు కాగా వారిలో 8 మంది కోలుకోగా, ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు.

ఆ ఇద్దరిలో ఒకరైన బాలిక కన్నమూసింది. కరోనాకు గురైన, కోలుకున్న 8 నుంచి 18 ఏళ్లు లోపు పిల్లల్లో ఈ రోగం కనబడుతుంది. 70 శాతం కంటే తక్కువ మందిలో శ్వాసకోశ, రక్తపోటు ఇబ్బందులు, న్యూమోనియా పీడించే ప్రమాదముంది.  వివిధ అవయవాలు విఫలమయ్యే ప్రమాదముంది. చికిత్సకు లక్షల రూపాయల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

చదవండి: రోమియోకు కటకటాలు..

మరిన్ని వార్తలు