ఆ టైంలో బయట ఉన్నందుకు...దంపతులకు రూ. 3000లు జరిమానా!

11 Dec, 2022 17:38 IST|Sakshi

ఒక జంట అర్ధరాత్రి బయట ఉన్నందుకు దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ సమయంలో బయటకు రావడం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ మూడు వేలు జరిమానా విధించారు పోలీసులు. కట్టేంత వరకు వారిని రకరకాలుగా వేధింపులకు  గురిచేశారు. దీంతో సదరు బాధితుడు సహాయం కోసం కమిషనర్‌ ఆఫ్‌ పోలీసును ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...కర్ణాటకలోని బెంగళూరులో ఒక జంట తమ స్నేహితుడు బర్త్‌డే కేక్‌ కటింగ్‌ ఈవెంట్‌కి హజరై తిరిగి ఇంటికి పయనమయ​ఆయరు. ఆ క్రమంలోనే ఆ జంట తమ ఇంటికీ సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వారికి సమీపంలో ఒక పెట్రోలింగ్‌ వ్యాన్‌ ఆగింది. పోలీస్‌ యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఐడీ కార్డులు చూపించమని ఆ జంటను డిమాండ్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ జంట అవాక్కయ్యింది. సాధారణ రోజుల్లోనే కదా మేము బయటకు వచ్చింది, ఎందకని తమను ఇలా ఐడీ కార్డులు చూపించమని నిలదీస్తున్నారో వారికి ఒక్కసారిగా అర్థం కాదు.

ఆ తర్వాత ఆ దంపతలు తమ ఐడీ కార్డులను పోలీసులకు చూపించారు. ఆ తదనంతరం పోలీసులు ఆ జంట వద్ద నుంచి ఫోన్లు లాక్కుని వ్యక్తిగత వివరాలను విచారించడం ప్రారంభించారు. అర్థరాత్రి సమయం కావడంతో వారు కూడా ఓపికగా సమాధానాలు చెప్పారు. ఇంతలో వారిలో ఒక పోలీసు ఆ జంట పేర్లను, ఆధార్‌ నెంబర్లను నమోదు చేయడం చూసి...మాకు ఎందుకు చలానా జారీ చేస్తున్నారని ప్రశ్నించాం. అందుకు పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరగడానికి అనుమతి లేదని చెప్పారు. అలాంటి నియమం లేదని తెలిసినా...ఫోన్‌లు స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితి తీవ్రతరం కాకూడదనే ఉద్దేశ్యంతో దీని గురించి తమకు తెలియదని మర్యాదపూర్వకంగా చెప్పడమే గాక క్షమాపణలు కూడా చెప్పింది ఆ జంట.

అయినా పోలీసులు వారిని వదలకుండా వేధింపులకు గురి చేశారు. పైగా రూ. 3000లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆ జంట ఎంతగా ప్రాథేయపడిన వినకపోగా అరెస్టులు చేస్తామని బెదిరించారు పోలీసులు. కాసేపటికి పోలీసుల్లో ఒకరూ ఆ జరిమానాలో కనీసం మొత్తం చెల్లించేస్తే వదిలిపెట్టేస్తారని చెప్పారు. ఆ తర్వాత తాను పేటీఎం ద్వారా చెల్లించేంత వరకు పోలీసులు తమను వదలలేదని బాధితుడు కార్తీక్‌ పత్రి అన్నారు.

ఆఖరికి నా భార్య కన్నీరు పెడుతున్న  దయాదాక్షిణ్యం చూపకుండా అత్యంత అమానుషంగా ప్రవర్తించారని వాపోయాడు కార్తీక్‌. ఈ వియషయాంలో తనకు సాయం చేయాల్సిందిగా బాధితుడు కార్తీక్‌ బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి ట్విట్టర్‌ వేదికగా తన ఆవేదనను వివరించాడు. ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ అనూప్ శెట్టి స్పందించి...ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చినందకు కార్తీక్‌కి ధన్యావాదాలు. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

(చదవండి: మొబైల్‌లో గేమ్ ఆడుతుండగా పేలుడు..తీవ్రంగా గాయపడ్డ చిన్నారి)

మరిన్ని వార్తలు