లెక్చరర్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నారా? వివరణ కోరిన సుప్రీంకోర్టు

28 Aug, 2023 17:33 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన లెక్చరర్ జరూర్ అహ్మద్ భట్‌ను ఆయన పనిచేసే కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ అంశాన్ని వెంటనే పరిశీలించాల్సిందిగా అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాలను కోరింది సుప్రీంకోర్టు. 

గత బుధవారం ఢిల్లీ వచ్చిన జరూర్ అహ్మద్ భట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురి సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళ్లిన ఆయనకు వారు పనిచేసే కాలేజీ యాజమాన్యం సస్పెన్షన్ ఆర్డర్లు జారే చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్. 

వెంటనే స్పందిస్తూ సుప్రీం ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని ఇక్కడ కోర్టు ముందు హాజరైన ఉద్యోగిని విధుల నుంచి తొలగించారని చెబుతున్నారు.. ఈ అంశాన్ని ఒకసారి పరిశిలించండి.. వీలయితే లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడండని సూచించింది.  ఇది ప్రతీకార చర్య కాదు కదా..? అని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించగా జస్టిస్ ఎస్‌కె కౌల్ దానిపై ఎలాంటి స్పష్టత లేదని న్యాయస్థానికి తెలిపారు.   

భట్ జమ్మూ కశ్మీర్ ఉద్యోగుల క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించారని, జమ్మూ కశ్మీర్ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని, సెలవు నిబంధనలను అతిక్రమించినందుకు ఆయనపై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది జమ్మూ కశ్మీర్ విద్యా శాఖ. ఈ సస్పెన్షన్ సమయంలో భట్ జమ్ము పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు జవాబుదారీగా ఉంటారని తెలిపారు. 

గురువారం సుప్రీం ధర్మాసనం ముందు హాజరై తన వాదనలను వినిపించిన భట్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న తనకు మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని విద్యార్థులు అడిగితే సమాధానం చెప్పడం కష్టాంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను కోల్పోయి రెండు కేంద్ర పాలిట ప్రాంతాలుగా విభజించబడిందని ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టులో వాదించారు.     

ఇది కూడా చదవండి: ‘ఆస్తులు పోగొట్టుకున్నా.. లోకేష్‌ నుంచి ప్రాణహాని ఉంది’

మరిన్ని వార్తలు