మనీష్‌ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్‌

12 Feb, 2024 17:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు అయంది. తనకు మూడు రోజులు బెయిల్‌ ఇవ్వాలని మనీష్‌ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.  ఆయన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి  ఎంకే నాగ్‌పాల్‌ మధ్యంతర బెయిల్‌ ఇచ్చారు.

ఈ నెల 13 నుంచి 15 వరకు  మూడు రోజులు బెయిల్‌ ఇస్తున్నట్లు తెలిపారు.  ఈ మూడు రోజులు మనీష్‌ సిసోడియా తన మేనకోడలు వివాహానికి హజరవుతారని సమాచారం. ఢిల్లీ మద్యం  పాలసీకి సంబంధించి అవినీతి కేసులో సీబీఐ 26, ఫిబ్రవరి 2023న మనీష్‌ సిసోడియాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరీంగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సైతం మార్చి 9న ఆయన్ను ఆరెస్ట్‌ చేసింది.

చదవండి: Liquor Policy Case: మనీష్‌ సిసోడియాకు ఊరట

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega