ఉగ్ర అలజడి : హై అలర్ట్‌

22 Aug, 2020 15:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ​​భారీ స్థాయి పేలుడు పదార్థాలు కలిగిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడం కలకలం రేపుతోంది. శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ నడి వీధుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద పేలుడు పదార్థాలను గుర్తంచారు. వెంటనే తేరుకున్న సిబ్బంది దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే అతన్ని విచారిస్తుండగా ప్రమాదకర నిషేదిత ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతనితో పాటు మరికొంత మంది ఉగ్రవాదులు ఢిల్లీ సరిహద్దుల నుంచి ఉత్తర ప్రదేశ్‌లోకి అక్రమంగా చొరబడినట్లు తెలిసింది. (చొరబాటుదారులను కాల్చి చంపిన బీఎస్‌ఎఫ్‌)

ఈ నేపథ్యంలో యూపీ పోలీసుశాఖను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.  ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హితేష్‌ చంద్ర అవాస్తీతో చర్చించి సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించాలని, చెక్‌పోస్టుల వద్ద భద్రతలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించింది. దీంతో శనివారం రాష్ట్ర పోలీసులు ఉన్నతాధికారులతో సమావేశమైన డీజీపీ దేశంలో ఉగ్ర అలజడి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలిన ఆదేశాలు జారీచేశారు. గణేష్‌ ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో ఓ కన్నేసి ఉండాలని సూచించారు.  

మరిన్ని వార్తలు