పెళ్లంటే.. రక్తదానం..అవయవదానం..ఇదో వెరైటీ మ్యారేజ్ గురూ..!

10 Jun, 2023 14:53 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌: ఎవరైనా పెళ్లంటే..బంధుమిత్రులతో ఘణంగా చేసుకోవాలని భావిస్తారు. పసందైన విందుతో అందరి మన్ననలను పొందాలని భావిస్తారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ధమ్‌తారీ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి మాత్రం కాస్త విభిన్నంగా జరిగింది. సమాజానికి ఉపయోగపడేలా వివాహాన్ని కొత్తగా జరుపుకోవాలనుకున్నారు వధూవరులు.ఇంతకూ వారు ఏం చేశారంటే..

జిల్లాలోని కాండెల్ గ్రామంలో ముకేష్, నేహాల వివాహాం అందరికీ స్ఫూర్తిని కలిగిస్తోంది. పెళ్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వధూవరులు. వారి పెళ్లికార్డులపై కూడా రక్తదాన ప్రాముఖ్యతను పేర్కొన్నారు. వారిరువురు పెళ్లిలో రక్తదానం చేయడమే గాక అవయవదానం చేస్తామని కూడా ప్రమాణం చేశారు. బంధుమిత్రుల చేత కూడా ఈ ప్రమాణాన్ని చేపించారు. రక్తదానం చేయడానికి  గ్రామవాసులందరు ముందుకు వచ్చారు.  ఈ విభిన్నమైన కార్యక్రమంతో వీరి పెళ్లి ఆదర్శవంతంగా జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ధమ్‌తారీ జిల్లా స్వాతంత్య్రోద్యమంలోనే ప్రముఖంగా నిలిచింది. 1920లోనే గాంధీజీ సత్యాగ్రహాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు.

ఇదీ చదవండి:పీనాసి ప్రియుడు: అరటి పండు తొక్కతీసి...

మరిన్ని వార్తలు