పంట చేలో పాల కంకి పల్లకిలో పిల్ల ఎంకి నవ్వినంత అందంగా...

3 Dec, 2023 00:21 IST|Sakshi

వైరల్‌

చీర గురించి ఎన్ని పాటలు రాసినా రాయాల్సినవి ఎన్నో మిగిలే ఉంటాయి. అందమైన చీరకట్టును చూస్తే పంటచేలో పాలకంకి, పల్లకిలో పిల్ల ఎంకీ నవ్వినంత అందంగా, అద్భుతంగా ఉంటుంది. డిజైనర్‌ నివేదిత సంజయ్‌ ప్రభు వినూత్నంగా డిజైన్‌ చేసిన చీరల ఛాయాచిత్రాలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి.

కేరళ కసువు శారీ (వైట్‌ కాటన్‌ శారీ విత్‌ గోల్డెన్‌ జరి బార్డర్‌) రకరకాల వేడుకలకు క్లాసిక్‌ ఫేవరేట్‌గా పేరు పొందింది. డిజైనర్‌ నివేదిత సంజయ్‌ ప్రభు ఈ చీరకు సంబంధించి పురాతన టెక్నిక్‌లను మాన్యువల్‌ స్క్రీన్‌  ప్రింటింగ్‌ ద్వారా తిరిగి తీసుకువచ్చింది. ప్రతి ప్రింట్‌ ఒక అందమైన కథ చెబుతుంది. అరటిఆకుల నుంచి ఇంగ్లీజ్‌ రోజ్, చెంబూర్‌ ఫ్లవర్‌ వరకు ప్రకృతిలోని ఎన్నో అందాలు కసువు చీరెలో కనిపించి కనువిందు చేస్తాయి.

మరిన్ని వార్తలు