మా వాదనలూ వినండి 

19 Mar, 2023 02:09 IST|Sakshi

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్‌ దాఖలు  

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో తమ వాదనలు వినాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు శనివారం ఈడీ కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ కేసులో తనపై ఈడీ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇటీవల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కవిత చేసిన అభ్యర్థనను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసును ఈనెల 24న విచారించనుంది. మరోవైపు 20న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు