కుటుంబ తగాదాలు.. అత్తా మరదలుపై దాష్టీకం

8 Jun, 2021 19:05 IST|Sakshi

కుటుంబ తగాదాలతో సొంత మరదల్ని పీక కోసి చంపిన ఓ యువకుడు.. ఆపై అత్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒడిశా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసు. ఈ భయానక ఘటన వివరాల్లోకి వెళ్తే.. 

కియోంజ్​హర్​: ఒడిషా వ్యాప్తంగా ఓ కేసు సంచలనంగా మారింది. కుటుంబ తగాదాలు శ్రుతి మించడంతో ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. మరదలిని హత్య చేసి.. ఆపై అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కియోంజ్​హర్​ జిల్లా కిరిబురు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నిందితుడు రూప్​సింగ్​కు, బంధువులైన బాధితురాలి కుటుంబంతో చాలాకాలంగా గొడవలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో అడవిలో పుట్టగొడుగులు, కర్ర ఏరుకునేందుకు ఆ తల్లీకూతుళ్లు వెళ్లారు. అయితే వాళ్లను అనుసరించిన నిందితుడు.. అక్కడ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా గొడ్డలితో మరదలి గొంతును కోశాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. అంతటితో ఆగకుండా ఆ యువతి తల్లిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆపై యువతి శవాన్ని మోసుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న 200 అడుగుల లోయలో పడేశాడు. ఇదే అదనుగా భావించిన యువతి తల్లి.. అక్కడి నుంచి తప్పించుకుని దగ్గర్లో ఉన్న జార్ఖండ్​ అవుట్​పోస్ట్ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే బొలానీ పోలీసులకు వాళ్లు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బార్బిల్​ సబ్​ డివిజినల్ ఆఫీసర్​ ఘటనాస్థలానికి చేరుకుని లోయ నుంచి యువతి మృతదేహాన్ని వెలికి తీశారు. బాధితురాలి తల్లిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపి.. రూప్​ సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ దారుణ ఘటనలో నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ కేసు మీడియాలో హైలైట్ కావడంతో.. దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం నవీన్ పట్నాయక్​ పోలీస్​ శాఖను ఆదేశించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు