ఐదో రోజుకు ఒడిషా ఐటీ దాడులు..బయటపడ్డ సంచలన విషయం

10 Dec, 2023 13:43 IST|Sakshi

భువనేశ్వర్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒడిషా ఇన్‌కమ్‌ట్యాక్స్‌(ఐటీ) దాడులు ఐదో రోజు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి.జార్ఖండ్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేత ధీరజ్‌సాహుకు చెందిన లిక్కర్‌ కంపెనీ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ.300 కోట్ల లెక్కల్లోకి రాని నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ధీరజ్‌సాహుకు చెందిన బౌధ్‌ డిస్టిలరీతో పార్టనర్‌షిప్‌లో ఉన్న బల్దేవ్‌ సాహు గ్రూపు కంపెనీల్లో ఉన్న ఐటీ అధికారులు ఇవాళ ఉదయం సోదాలు నిర్వహించారు.ఐటీ అధికారులు ఈ కంపెనీల కార్యాలయాల నుంచి మరింత నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరోపక్క సాహు, ఆయన బంధువుల కంపెనీల కార్యాలయాలు, ఇళ్ల నంచి బయటపడుతున్న గుట్టలు గుట్టల సొమ్మును లెక్కించడానికి ఐటీ అధికారులు చెమటోడ్చాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ డబ్బు లెక్కించేందుకు 40 కౌంటింగ్‌ మెషీన్లు వినియోగిస్తుండగా తాజాగా మరిన్ని మెషీన్లను, సిబ్బందిని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) నుంచి రప్పించారు.సోదాల్లో దొరికిన మొత్తం అక్రమ నగదు రూ.350 కోట్ల వరకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అయితే ఐదో రోజు సాహూ కంపెనీలపై జరుగుతున్న ఐటీ సోదాల్లో సంచలన విషయం బయటపడింది.నగదులోఉన్న రూ.5 లక్షల పాలిథిన్‌ బ్యాగుపై ఇన్స్‌పెక్టర్‌ తివారీ అని పేరు రాసి ఉండడం విశేషం. కాగా, ఇదే విషయమై బీజేపీ నేషనల్‌ చీఫ్‌ జగత్‌ ప్రకాష్‌ నడ్డా ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు. ‘మీరు పరిగెత్తి పరిగెత్తి అలసిపోవాల్సిందే..మిమ్మల్ని విడిచిపెట్టం’ అని పోస్టులో నడ్డా పేర్కొన్నారు. 

ఇదీచదవండి..యువకుడి సెల్ఫ్‌ ‘రిప్‌’ పోస్టు..వెంటనే సూసైడ్‌

>
మరిన్ని వార్తలు