20 ఏళ్ల క్రితం ఇంటికి తాళం.. దెయ్యాలు ఉంటాయని పూజలు

27 Aug, 2021 07:45 IST|Sakshi

వేలూరు: తాళం వేసిన ఇంట్లో దెయ్యాలు ఉంటాయేమోనన్న అవకాశంతో పూజలు చేసిన సంఘటన రాణిపేట జిల్లాలో కలకలం రేపింది. వివరాలు.. అరక్కోణం తాలుకా తనిగై పోలూరు గ్రామానికి చెందిన ఆశీర్వాదం 20 ఏళ్ల క్రితం ఇంటికి తాళం వేసి చెన్నైకి వెళ్లిపోయాడు. బుధవారం సాయంత్రం ఆశీర్వాదంతో పాటు ఒక చిన్నారి, కొందరు వ్యక్తులు గ్రామానికి వచ్చారు. అర్ధరాత్రి వేళ ఇంట్లో తవ్వకాలు జరిపి పూజలు చేశారు.

స్థానికుల సమాచారంతో  అరక్కోణం పోలీసులు ఆశీర్వాదంను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన మూడో కుమార్తె భర్త ఇటీవల మృతి చెందాడని.. ఆమెను ఇక్కడ ఉంచేందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నట్లు తెలిపాడు. ఏళ్ల తరబడి మూసివేసిన ఇంట్లో దెయ్యం ఉండవచ్చని పూజారి చెప్పడంతో పూజలు చేసినట్లు చెప్పాడు.   

మరిన్ని వార్తలు