భారత యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ మంత్రి ఫిదా..! రోడ్డుపై కూరగాయలు కొని..

20 Aug, 2023 20:00 IST|Sakshi

బెంగళూరు: భారత్‌లో యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ డిజిటల్, ట్రాన్స్‌పోర్టు మంత్రి విస్సింగ్ ప్రశంసలు కురిపించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ పేమెంట్స్ వాడటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతటి సులభతర విధానాన్ని భారతీయులందరూ వాడుతున్నారని పేర్కొంటూ జర్మన్ ఎంబసీ తన ట్వీట్టర్(ఎక్స్ )లో పేర్కొంది. మిస్సింగ్ కూరగాయలు కొని, పేమెంట్స్ చేస్తున్న వీడియోను పంచుకుంది. 

డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారత్ గణవిజయం సాధించిందని మిస్సింగ్ అన్నారు. సెకన్ల కాలంలోనే చెల్లింపులు చేసుకునే విధానంపై ఆయన ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు. సులభతరంగా చెల్లింపులు చేసుకునే యూపీఐ పేమెంట్స్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెంగళూరులో జరుగుతున్న జీ20 డిజిటల్ మినిస్టర్స్‌ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించారు.  

జర్మన్ ఎంబసీ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భారీ సంఖ్యలో స్పందించారు. యూపీఐ పేమెంట్స్‌లో భాగం అయినందుకు మిస్సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత డిజిటల్ విప్లవంపై స్పందించినందుకు థ్యాంక్స్ చెప్పారు. యూపీఐ ప్రపంచవ్యాప్తంగా మారింది.. ఇందులో జర్మనీ ఎప్పుడు చేరుతుందని ప్రశ్నించారు. యూపీఐ అనేది భారత్‌లో వేగవంతంగా చెల్లింపులు చేసుకునే డిజిటల్ విధానం. ఇందులో శ్రీలంక, సింగపూర్, ఫ్రాన్స్ భాగం అయ్యాయి.   

ఇదీ చదవండి: రాహుల్‌ గాంధీ బైక్ రైడ్‌.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు..

మరిన్ని వార్తలు