ఫోర్త్‌ వేవ్‌ ఎఫెక్ట్‌: బూస్టర్‌ డోస్‌పై కేంద్రం కీలక నిర్ణయం

6 Jul, 2022 18:14 IST|Sakshi

Covid booster dose.. దేశంలో ఫోర్త్‌ వేవ్‌ కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణ‍యం తీసుకుంది. 

పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్‌, బూస్ట‌ర్ డోస్ మ‌ధ్య గ్యాప్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డోసుల మధ్య గ్యాప్‌ను ఆరు నెల‌ల‌కు త‌గ్గించింది. సెకండ్ డోస్‌, బూస్ట‌ర్ డోస్ మ‌ధ్య వ్య‌వ‌ధిని త‌గ్గించాల‌ని వ్యాక్సినేష‌న్‌పై స‌ల‌హా మండ‌లి నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేష‌న్ (NTAGI) సూచించింది. ఈ మేరకు తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సెకండ్ డోస్‌కు, బూస్ట‌ర్ డోస్‌కు మధ్య 9 నెలల గ్యాప్‌ ఉంది. ఈ గ్యాప్‌ను తాజాగా 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, 18-59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు.. సెకండ్ డోస్ తీసుకున్న ఆరు నెల‌లు లేదా 26 వారాల త‌ర్వాత ప్రికాష‌న్ డోసు తీసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, నిర్వాహకులకు లేఖ ద్వారా తెలిపారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో జికా వైరస్‌ కలకలం.. హెచ్చరించిన వైద్యులు

మరిన్ని వార్తలు