సోషల్‌ మీడియా నియంత్రణకు చట్టం! 

22 Feb, 2021 03:05 IST|Sakshi

బీజేపీ సీనియర్‌ నేత రాం మాధవ్‌ వ్యాఖ్య 

కోల్‌కతా: సామాజిక మాధ్యమాలు ప్రభుత్వాలను కూలదోయగలవని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చగలవని అందుకే వాటిలోని పోస్టులపై నియంత్రణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఓ చట్టాన్ని తయారు చేస్తోందని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కోల్‌కతాలో తాను రాసిన ‘బికాజ్‌ ఇండియా కమ్స్‌ ఫస్ట్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయేతర, విదేశీ శక్తుల వల్ల ప్రజాస్వామ్యానికి సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు.

సామాజిక మాధ్యమాల్లోని ఇలాంటి పోస్టులను ఎదుర్కునేలా ప్రస్తుత చట్టాలు రూపొందలేదని, వాటిని ఎదుర్కోవడానికి కొత్త చట్టం కావాలని, దానిపై ఇప్పటికే ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. దేశంలో ట్విట్టర్‌పై ప్రభుత్వం నుంచి ఇప్పటికే పలు సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాను రాసిన కొత్త పుస్తకం మోదీ ప్రభుత్వంలోని పలు నిర్ణయాలపై చర్చ చేస్తుందని తెలిపారు.    

మరిన్ని వార్తలు