25 శాతం స్కూలు‌ ఫీజు రద్దు: గుజరాత్‌

1 Oct, 2020 08:45 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ పాఠశాలలు 2020–21 విద్యా సంవత్సరానికి గానూ 25 శాతం ట్యూషన్‌ ఫీజును తగ్గించుకోవడానికి అంగీకరించాయని గుజరాత్‌ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సింగ్‌ చూడసమ తెలిపారు. రాష్ట్రంలోని సీబీఎస్‌ఈ పాఠశాలలు సహా అన్ని పాఠశాలలు దీన్ని అనుసరించాల్సిందేనని ఆయన అన్నారు. పాఠశాలలు రవాణా ఫీజులు సహా ఎలాంటి అదనపు ఫీజులను వసూలు చేయబోవని చెప్పారు. కోవిడ్‌ నేపథ్యంలో పాఠశాలలు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పటికే ఫీజు చెల్లించి ఉంటే, వాటిని రాబోననే నెలలకు అడ్జస్ట్‌ చేయాలని చెప్పారు. గుజరాత్‌ లో గత 180 రోజులకు పైగా మూసే ఉన్నాయి. ఆన్లైన్‌ క్లాసులకు కేవలం 40శాతం విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు