జ్ఞానవాపి మసీదు కేసు: వారణాసి కోర్టులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వ్‌

23 May, 2022 15:42 IST|Sakshi

లక్నో: జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి (మంగళవారం) రిజర్వ్ చేసింది. హిందూ వర్గం దాఖలుచేసిన రెండు పిటిషన్లతోపాటు ముస్లిం కమిటీ వేసిన ఒక పిటిషన్‌ను జిల్లా జడ్జ్‌ అజయ్‌కృష్ణ విశ్వేష విచారించారు. విచారణ సందర్భంగా కోర్టు హాలులోకి 23 మందిని మాత్రమే అనుమతించారు. వీరిలో 19 మంది లాయర్లు కాగా, నలుగురు పిటిషనర్లు.

జ్ఞాన్‌వాపి ప్రాంగణంలోని శృంగార గౌరి కాంప్లెక్స్‌లో నిత్యపూజలకు, వజుఖానాలో వెలుగుచూసిన శివలింగాన్ని ఆరాధించేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు శివలింగం లోతు ఎత్తు తెలుసుకునేందుకు సర్వే కొనసాగించాలని హిందూవర్గం కోరుతోంది. వజుఖానా మూసేయవద్దని ముస్లిం కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద జ్ఞానవాపి సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది.
చదవండి: Vismaya Case: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది

మరిన్ని వార్తలు