దేశీయంగా 100 యుద్ధ విమానాలు

13 Jun, 2022 06:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’లో భాగంగా దాదాపు 100 అత్యాధునిక యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసే దిశగా వాయుసేన భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలతో చర్చిస్తోంది. ఈ ప్రాజెక్టులో 70 శాతం భారత కరెన్సీనే వాడేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

దీని వల్ల మేకిన్‌ ఇండియా ప్రాజెక్టు మరింత బలోపేతం కానుందన్నాయి. ‘‘భారత్‌లో 96 యుద్ధ విమానాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 36 విమానాల తయారీకి మన కరెన్సీతో పాటు విదేశీ మారక ద్రవ్యమూ చెల్లిస్తాం. 60 విమానాల చెల్లింపులకు పూర్తిగా భారత్‌ కరెన్సీనే వాడతాం’’ అన్నాయి.

మరిన్ని వార్తలు