జమ్మూ కశ్మీర్‌లో భారీగా మారణాయుధాలు పట్టివేత

25 Dec, 2022 16:57 IST|Sakshi

భారత సైన్యం, జమ్ముకాశ్మీర్‌ పోలీసులు భారీ మొత్తంలో యుద్ధం తరహా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారు ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యూరీలోని హత్‌లాంగా సెక్టార్‌లో ఈ ఆయుధాలను గుర్తించారు. ఆ ఆయుధాల్లో ఎనిమిది ఏకేఎస్‌ 74 రైఫిళ్లు, 560 లైవ్‌ రైఫిల్‌ రౌండ్లు, 12 చైనీస్‌ పిస్టల్స్‌, 14 పాకిస్తాన్‌, చైనా గ్రెనేడ్‌లతో పాటు పాకిస్తాన్‌ జెండాతో కూడిన బెలూన్‌లు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కల్నల్‌ మనీష్‌ పంజ్‌ చెప్పారు. ఆ ఆయుధాలు పాకిస్తాన్‌వేనని, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నారు కల్నల్‌ మనీష్‌ పంజ్‌

పాకిస్తాన్‌కి చెందిన మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ కేసును చేధించే క్రమంలోనే ఒక రాజకీయ కార్యకర్త, కాంట్రాక్టర్‌, దుకాణాదారుడు, ఐదుగురు పోలీసులతో సహా సుమారు 17 మందిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాతే ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో పౌల్ట్రీ షాపు యజమాని మహ్మద్‌ వసీమ్‌ నజర్‌ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అతడిచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు తెలిపారు. 

(చదవండి:15 రోజుల పాటు శిక్ష..ఆప్‌ మంత్రికి మరో ఎదురు దెబ్బ)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు