టికెట్‌ బుకింగ్‌ సమయంలో షాక్‌.. ఐఆర్‌సీటీసీపై యూజర్లు ఫైర్‌!

4 Mar, 2023 18:11 IST|Sakshi

దేశ ప్రజలకు ఇండియన్‌ రైల్వేస్‌ అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణం చేయాలనుకుంటే ఖచ్చితంగా   రైలు ప్రయాణానికే ఓటు వేస్తారు. అంతేనా ప్యాసింజర్లకు సరికొత్త సేవలను కూడా తీసుకోస్తోంది రైల్వే శాఖ. ప్రతి రోజూ వేలాది మంది ప్యాసింజర్లు రైలు ప్రయాణం మీద ఆధారపడుతున్నారు కనుకే ఏ మాత్రం చిన్న తప్పులు జరిగినా దాని ప్రభావం అదే స్థాయిలో ఉంటుంది. తాజాగా తత్కాల్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌ మొరాయించడంతో యూజర్లు నెట్టింట తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సర్వర్‌ డౌన్‌.. ఫైర్‌ అవుతున్న నెటిజన్స్‌!
ట్రైన్‌లో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే తత్కాల్ బుకింగ్‌ల వైపే ప్రజలు మొగ్గు చూపుతారన్న విషయం తెలిసిందే. ఈ తత్కాల్‌ సేవల కోసం ఆన్‌లైన్‌లో ఉదయం 10:00 గంటల నుంచి ACతరగతి, ఉదయం 11 గంటలకు నాన్ ఏసీ తరగతికి సంబంధించిన టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. అయితే శనివారం, ఎప్పటిలానే ప్యాసింజర్లు తత్కాల్ బుకింగ్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఐఆర్‌సీటీసీ సర్వర్‌ మొరాయించింది. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

టికెట్‌ బుకింగ్‌ కోసం యూజర్లు లాగిన్‌ చేస్తున్న సమయం నుంచి పేమంట్‌ వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే తత్కాల్‌ బుకింగ్‌ కోసం అమౌంట్‌ చెల్లించి, కస్టమర్ల ఖాతా నుంచి డిడెక్ట్‌ అయినప్పటికీ రైలు టికెట్‌ మాత్రం కన్ఫర్మ్‌ కాలేదట. ఈ మేరకు కొందరు యూజర్లు వాపోతున్నారు. అలాగే మరికొందరు యూజర్లు టికెట్‌ బుకింగ్‌ సమయంలో వచ్చిన ఎర్రర్‌ మెస్సేజ్‌లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం దీనిపై ట్వీట్స్‌, మీమ్స్‌ నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐఆర్‌సీటీసీ నుంచి ఎటువంటి స్పందన లేదు.
 

మరిన్ని వార్తలు