సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్‌ యుయు లలిత్‌

27 Aug, 2022 10:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‍లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిస్‌ యు.యు. లలిత్‌తో శనివారం ఉదయం ప్రమాణం చేయించారు. కాగా.. యు.యు. లలిత్‌ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. 

మరిన్ని వార్తలు