సీఎం శివరాజ్‌ సింగ్‌ మంచి నటుడు: కమల్‌నాథ్‌

12 Nov, 2023 15:25 IST|Sakshi

 భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ప్రజలు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ కమల్‌నాథ్‌ అన్నారు. అయితే సీఎం కుర్చీపోయినా శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఉద్యోగానికి ఢోకా లేదని నాథ్‌ చెప్పారు.

శివరాజ్‌సింగ్‌ మంచి నటుడని, సీఎం పదవి పోయిన తర్వాత ముంబై వెళ్లి సినిమాల్లో ట్రై చేసుకోవచ్చని కమల్‌నాథ్‌ చమత్కరించారు. సాగర్‌ జిల్లాలోని రేహ్లీ‌ అసెంబ్లీ స్థానంలో ప్రచారం సందర్భంగా కమల్‌నాథ్‌ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఇంటికెళ్లడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన శివరాజ్‌​సింగ్‌ కనీసం బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు కూడా నింపలేకపోయారని ఎద్దేవా చేశారు. 

ఎన్నికల వేళ మళ్లీ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హామీల మెషీన్‌ డబుల్‌ ‍స్పీడ్‌తో పనిచేస్తోందని, దీనిని ప్రజలు గమనించాలని కమల్‌నాథ్‌ కోరారు.మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఈ నెల 17న పోలింగ్‌ జరగనుంది. గతంలో సీఎంగా పనిచేసిన కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ తరపున మళ్లీ సీఎం అభ్యర్థిగా ఉన్నారు.       
ఇదీ చదవండి..కుప్పకూలిన చార్‌దామ్‌ టన్నెల్‌..చిక్కుకున్న 40 మంది

మరిన్ని వార్తలు