ఆంక్షలు లేని నిషా.. పాత రికార్డు బద్దలు

4 Jan, 2022 00:06 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కోవిడ్‌ భయాలు, రాత్రి కర్ఫ్యూ ఏవీ మందుబాబులను అడ్డుకోలేకపోయాయి. రాష్ట్రంలో కొత్త ఏడాదికి మద్యం విక్రయాల్లో గత ఏడాది రికార్డు బద్ధలైంది. డిసెంబర్‌ 31న మొత్తం 2.39 లక్షల పెట్టెల మద్యం అమ్ముడైంది. 2020 డిసెంబర్‌ 31న ఇది 2.25 లక్షల బాక్సులుగా ఉండింది.  

పగలే రికార్డు కొనుగోళ్లు  
కరోనా అంటే తెలియని 2019 డిసెంబర్‌ 31న 3.62 లక్షల బాక్సుల మద్యాన్ని స్వాహా చేశారు. 2020లో కొంచెం తగ్గి, 2021లో మళ్లీ ఊపందుకున్నాయి. తాజాగా నైట్‌ కర్ఫ్యూ జారీ చేసినప్పటికీ కొనుగోళ్లు తగ్గలేదు. పగటి పూట వైన్‌షాపులకు పోటెత్తారు. పబ్‌లు, బార్లు రాత్రి మూతపడడం వల్ల పగలే కొని పెట్టుకున్నారు.  

నెలలో రూ.977 కోట్ల రాబడి 
2021, డిసెంబర్‌ మాసంలో మొత్తం 17.18 లక్షల పెట్టెల మద్యం, సుమారు 10.13 లక్షల పెట్టెల బీర్లు ఖాళీ అయ్యాయి. తద్వారా ప్రభుత్వానికి రూ. 977 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా (13 శాతం) ఆదాయం వచ్చింది. 

మరిన్ని వార్తలు