ఓపికపట్టండి! క్యాబినేట్‌ విస్తరణపై ఉత్కంఠ

22 Oct, 2022 15:24 IST|Sakshi

బెంగళూరు: కేబినేట్‌ విస్తరణపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ విషయమై కేంద్రంలోని బీజేపీతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఐతే కేబినేట్‌లో ఎవరిని చేర్చుకోవాలనే దానిపై బీజేపీ హైకమాండ్‌దే తుది నిర్ణయం అని తేల్చి చెప్పారు. సీనియర్లకు అవకాశం ఇస్తారా? ఇవ్వరా? అని మీడియా ప్రశ్నించగా... రాజకీయ పరిస్థితుల కారణంగా ఆలస్యమవుతుందే తప్ప ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు కొత్తమంది మంత్రులు పలు ఆరోపణలతో ఆయా మంత్రిత్వ శాఖలకు రాజీనామా చేశారు.

మళ్లీ వాళ్లని చేర్చకుంటారా అని పలు ప్రశ్నలను సీఎం బొమ్మైపై సంధించింది మీడియా. దీనికి బొమ్మే స్పందనగా.. ఆశావాహులందరూ ప్రయత్నిస్తారు, కానీ చివరకు హైకమాండ్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని కరాఖండిగా చెప్పరు. అందువల్ల అందరూ మంత్రి వర్గ విస్తరణ విషయంలో ఓపికతో చూడాల్సిందేనని సూచించారు.  వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమయానికి తాజా ముఖాలకు చోటు కల్పించే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగకపోవడంతో సీఎం బొమ్మైపై గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నవాటిని భర్తీ చేయడం లేదా కొన్నింటిని తొలగించడం ద్వారా కొత్తవారికి అవకాశం ఇచ్చే నివేదికలు వచ్చినప్పటికీ... ఎలాంటి కార్యరూపం దాల్చే లేకపోయింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పలువురు నాయకులు ఇది చాలా ఆలస్యం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

(చదవండి: తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ)

మరిన్ని వార్తలు