పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!

28 Jun, 2022 14:47 IST|Sakshi
అదాలత్‌లో బసప్ప (పసుపుతలపాగ), కళవ్వ

వృద్ద జంటను కలిపిన లోక్‌ అదాలత్‌

హుబ్లీ: పెళ్లయిన కొత్తలో గొడవలతో వేరుపడ్డారు. విడాకులు కూడా తీసుకుని 52 ఏళ్ల పాటు ఎవరికొద్దీ వారు జీవించారు. చివరకు లోక్‌ అదాలత్‌ వారిని ఒక్కటి చేసింది. ఈ అపరూప సన్నివేశం కర్ణాటక రాష్ట్రం ధార్వాడ జిల్లా కలఘటికిలో నిర్వహిస్తున్న లోక్‌ అదాలత్‌లో చోటు చేసుకుంది. 

జెన్నూరు గ్రామానికి చెందిన బసప్ప అగడి (85), మాజీ భార్య కళవ్వ (80) 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కళవ్వకు బసప్ప ప్రతి నెలా భరణం చెల్లించేవాడు. గత కొన్ని నెలలుగా చెల్లించలేకపోయాడు. దీంతో కళవ్వ కోర్టును ఆశ్రయించగా సోమవారం మెగా లోక్‌ అదాలత్‌లో జడ్జి జీఆర్‌ శెట్టర్‌ వారి సమస్యను పరిశీలించారు. నడవలేని స్థితిలో ఉన్న కళవ్వను చూసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి కలిసి జీవించాలంటూ హితబోధ చేశారు. దంపతులను ఒక్కటి చేసి పంపించారు. (క్లిక్: అయ్యబాబోయ్‌ ఏనుగులు.. పరుగో పరుగు!)

మరిన్ని వార్తలు