పంచాయతీ అధ్యక్షురాలు వీరంగం.. అందరూ చూస్తుండగా చెప్పుతీసుకుని..

24 Jun, 2022 19:21 IST|Sakshi
చెప్పుతో దాడికి యత్నిస్తున్న అధ్యక్షురాలు

రాయచూరు రూరల్‌(బెంగళూరు): పారిశుధ్యం సరిగా లేదని ఫిర్యాదు చేసినందుకు మస్కి తాలూకా తోరణదిన్ని పంచాయతీ అధ్యక్షురాలు చందమ్మ వీరంగం చేసి గ్రామస్తుడిపై దాడికి యత్నించింది. వివరాలు.. కాలనీలో చెత్త సేకరించే వాహనానికి డ్రైవర్‌గా పంచాయతీ అధ్యక్షురాలు తన బంధువును నియమించింది.

ఇతను చెత్త సేకరించడం లేదని, దీంతో కాలనీలో పరిసరాలు అధ్వానంగా ఉన్నాయని గ్రామానికి చెందిన బసవరాజ్‌ గురువారం అధ్యక్షురాలు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆమె ఒక్కసారిగా చెప్పు తీసుకొని అతనిపై దాడికి యత్నించింది. స్థానికులు అడ్డుకొని సర్దిచెప్పారు.

చదవండి: ‘మహా’ సంక్షోభం: షిండేపై ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు