Kerala: ఫుడ్ పాయిజన్‌తో నర్సు మృతి.. 429 హోటళ్లపై రైడ్..

4 Jan, 2023 18:31 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో హోటళ్లపై ఆహార భద్రత శాఖ కొరడా ఝులిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 429 హోటళ్లపై రైడ్లు నిర్వహించింది. నిబంధనలు పాటించని 43 హోటళ్లను మూసివేసింది. 

కొట్టాయంలో ఓ ఈవెంట్‌కు హాజరైన నర్సు అక్కడ ఆహారం తిని అస్వస్థతకు గురై చనిపోయింది. ఫుడ్‌ పాయిజన్ కారణంగానే ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆహార భద్రత శాఖ ‍అప్రమత్తమై హోటళ్లపై మంగళవారం దాడులు చేసింది.

మూసివేసిన 43లో 21 హోటళ్లకు లెసెన్సులు లేవని అధికారులు తెలిపారు. మిగతా 22 హోటళ్లు పరిశుభ్రత పాటించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.

డిసెంబర్ 29న  ఓ ఈవెంట్‌కు హాజరైన 100 మంది అస్వస్థకు గురయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకున్నారు. దీనిపై  అధికారులు ఆరా తీయగా.. ఓ హోటల్‌ నుంచి వచ్చిన ఆహారం తిని వీరికి ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రంలోని హోటళ్లపై రైడ్లు చేయాలని ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు.
చదవండి: అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి?

మరిన్ని వార్తలు