‘ఫ్రెండ్‌ కోసమే దొంగిలించాను.. త్వరలోనే తిరిగిస్తాను’

6 Jul, 2021 20:17 IST|Sakshi
నెట్టింట్లో వైరల్‌ అవుతున్న లేఖ

జవాను ఇంట్లో చోరీ

విధిలేని పరిస్థితుల్లోనే దొంగతనం చేశాను క్షమించండి అంటూ లేఖ

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఓ వింత దొంగతనం చోటు చేసుకుంది. సరిహద్దులో ఉండి మనకు కాపాల కాసే జవాను ఇంటకి కన్నం వేశాడు ఓ దొంగ. బంగారం, విలువైన వస్తువులు దోచుకెళ్లడమే కాక విధిలేక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా దొంగతనం చేయాల్సి వచ్చింది.. క్షమించండి అని కోరుతూ ఓ లేఖ రాసి పెట్టి వెళ్లాడు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్‌ భింద్‌ జిల్లా భీమ్‌ నగర్‌ ప్రాంతంలో స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ (ఎస్‌ఏఎఫ్‌) జవాను ఇంట్లో కొన్ని రోజుల క్రితం దొంగతనం చోటు చేసుకుంది. బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లాడు. పోయిన వస్తువుల కంటే కూడా సదరు దొంగ రాసిన లేఖ అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఈ లేఖలో సదరు దొంగ ప్రాణాపాయంలో ఉన్న తన స్నేహితుడిని బతికించుకోవడం కోసమే ఈ దొంగతనానికి పాల్పడుతున్నానని తెలిపాడు. ‘‘క్షమించండి.. విధిలేని పరిస్థితుల్లోనే చోరీ చేయాల్సి వచ్చింది.. కానీ త్వరలోనే నేను దోచుకెళ్లిన సొత్తును తిరిగి మీకు అప్పగిస్తాను. ఇప్పుడిలా దొంగతనం చేయకపోతే.. నా స్నేహితుడు మరణిస్తాడు.. దయచేసి అర్థం చేసుకోండి’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు