కస్టమర్‌కు చేదు అనుభవం.. పిజ్జాలో గాజు ముక్కలు రావడంతో..

10 Oct, 2022 10:49 IST|Sakshi

ప్రస్తుత జనరేషన్‌ దాదాపు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసి తినేందుకే ఎక్కువ ప్రిపరెన్స్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక, పిజ్జా, బర్గర్‌ వంటివి స్పెషల్‌గా ఆర్డర్‌ ఇస్తుంటారు. తాజాగా డోమినోస్‌ నుండి పిజ్జా ఆర్డర్‌ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. పిజ్జాలో ఏకంగా గాజు ముక్కలు ఉండటంతో కస్టమర్‌ షాకయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఓ కస్టమర్‌ డోమినోస్‌ నుండి పిజ్జా ఆర్డర్‌ పెట్టాడు. దీంతో, జొమాటో నుంచి సదరు కస్టర్‌ పిజ్జాను అందుకున్నాడు. అనంతరం, ఎంతో ఇష్టంగా పిజ్జా తినడానికి రెడీ అయిపోయాడు. కవర్‌ ఓపెన్‌ చేసి పిజ్జా తింటున్న క్రమంలో మొదట ఒక గాజు ముక్క తగిలింది. ఒక్కటే కదా మిస్టేక్‌ అనుకొని లైట్‌ తీసుకున్నాడు. ఇంతలో మరో రెండు గాజు ముక్కలు తగలడంతో చిర్రెత్తుకుపోయాడు. కోపంతో వెంటనే ఫోన్‌ తీసి పిజ్జాలో వచ్చిన గాజుముక్కలను ఫొటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 

అనంతరం, తనకు జరిగిన చేదు అనుభవం గురించి పోలీసులను ఆశ్రయించాడు. ట్విట్టర్‌ వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ.. ముందుగా కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేయండి. ఒకవేళ వారు స్పందించకపోతే అప్పుడు లీగల్‌గా ప్రొసీడ్‌ అవ్వండి అంటూ సలహా ఇచ్చారు. ఇక, ఈ ఘటనపై డొమినోస్ సంస్థ స్పందించింది. డొమినోస్‌ తరఫున కస్టమర్‌కు క్షమాపణలు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఫుడ్‌ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కాగా, తమ తనిఖీల్లో రెస్టారెంట్‌లో ఎలాంటి గాజు సామాగ్రిని కనుగొనలేదని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు