ప్రధాని బెంగాల్‌ పర్యటనలో రాజకీయ వివాదం

28 May, 2021 18:02 IST|Sakshi

కోల్‌కతా: ‘యాస్‌’ తుపాను కారణంగా ఒడిశా,పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి.  దీనిలో భాగంగా ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్లోని తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో  ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ శుక్రవారం ఏరియల్ స‌ర్వే నిర్వ‌హించారు. అనంత‌రం ప్ర‌ధాని మోదీ.. ప‌శ్చిమబెంగాల్లో తుఫాన్ ప‌రిస్థితిపై అక్క‌డి ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఈ స‌మావేశానికి బెంగాల్ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌, ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి కూడా హాజ‌రు కావాల్సి ఉండ‌గా ఆమె సుమారు అరగంట ఆలస్యంగా వచ్చారు. అనంతరం మమత రెండు పేజీల నివేదిక ఇచ్చి త్వరగానే వెనక్కి వెళ్లిపోయారు. శుక్రవారం బెంగాల్ ప్రాంతాలలో ‘యాస్’ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఇరువురు నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉంది. 

మమత ఈ అంశంపై స్పందిస్తూ.. ప్రధానమంత్రి సమావేశానికి పిలిచారు.. కానీ నా కార్యలయానికి ఆ సమాచారం చేరలేదు. ఈ కారణంగా నేడు దిఘాలో ఒక సమావేశనికి హాజరయ్యాను. కానీ నేను కలైకుండకు వెళ్లి తుపాను నష్టానికి సంబంధించిన నివేదిక అందజేసిన అనంతరం ప్రధాని అనుమతితో తిరిగి వెళ్ళినట్లు తెలిపింది. కాగా సీఎం తీరుపై బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

చదవండి: ‘కరోనాకు గేట్లు తెరిచిన మోదీ: లెక్కలన్నీ అబద్ధం’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు