రూ. కోటి ఇవ్వు లేదా చంపేస్తాం: గ్యాంగ్‌స్టర్‌

11 Sep, 2021 21:29 IST|Sakshi

జైపూర్‌: సినిమాల్లో విలన్ల మాదిరే నిజ జీవితంలో కూడా కొందరు వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్న సంఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. చంపుతామనని బెదిరించే వారు కూడా ఉంటారు. తాజాగా ఇలాంటి ఒక సంఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ ఓ గ్యాంగ్‌స్టర్‌ బిల్డర్‌ని బెదిరిస్తున్నాడు.(చదవండి: సీఎం పదవికి రాజీనామా: నాలుగో వ్యక్తి రూపానీ.. ముందు ముగ్గురు ఎవరంటే)

వివరాల్లోకెళ్లితే.. జైపూర్‌కు చెందిన బిల్డర్‌ నిశ్చల్‌ భండారికి కొన్ని రోజుల క్రితం ఒక రోజు ఒక అపరిచిత వ్యక్తి నుంచి కాల్‌ వచ్చింది. సదరు వ్యక్తి తన పేరు లారెన్స్‌ బిష్ణోయ్‌ అని, తీహార్‌ జైలు నుంచి ఫోన్‌ చేస్తున్నాని చెప్పాడు. తనకు కోటి రూపాయలు కావాలని రెండు రోజుల్లోగా ఆ మొత్తాన్ని రెడీ చేయాలని హెచ్చరించాడు. సదరు బిల్డర్‌ ఇంటి చుట్టూ తన మనుషులు ఉన్నారని ఈ విషయం పోలీసులకు చెప్పే సాహసం చెయ్యెద్దంటూ బెదిరించాడు. 

ఈ క్రమంలో నిశ్చల్‌ భండారికి సెప్టెంబర్‌ 9న ఆ అపరిచిత వ్యక్తి నుంచి మరోసారి కాల్‌ వచ్చింది. కానీ భయంతో సదరు బిల్డర్‌ కాల్‌ రీసివ్‌ చేసుకోలేదు. దాంతో వేరువేరు వాట్సప్‌ నెంబర్లతో మెసెజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ చేశాడు నిందితుడు. ఆఖరికి బిల్డర్‌ నిశ్చల్‌ భండారి భయంతో శుక్రవారం పోలీస్టేషన్‌కి వెళ్లి విషయం చెప్పాడు. నిందితుడి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించమంటూ పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.(చదవండి: "యూ బ్లడీ ఫూల్‌" అంటూ.. మాట్లాడుతున్న బాతులు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు