నడుముకు చీర, చేతిలో బోర్డు.. అర్థనగ్నంగా ఊరేగింపు..

16 Jul, 2021 17:48 IST|Sakshi
వీడియో దృశ్యం

సూరత్‌ : ఏం దొంగతనం చేశాడో తెలియదు కానీ, ఓ బట్టల వ్యాపారిని దారుణంగా అవమానించారు జనం. నడుముకు చీర కట్టి, చేతిలో ‘‘దొంగ’’ అని పలు భాషల్లో రాసిన బోర్టుపెట్టి, అర్థనగ్నంగా మార్కెట్‌లో ఊరేగించారు. అతడు చేతిలో బోర్డుతో.. పెద్ద బ్లూ కలర్‌ ప్లాస్టిక్‌ బ్యాగుతో ముందు నడుస్తూ ఉంటే వెనకాల జనం సెల్‌ఫోన్లతో ఫొటోలు.. వీడియోలు తీస్తూ ఫాలో అవుతూ వచ్చారు. ఈ సంఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో పోస్టయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ తప్పు చేసిన వాళ్లను ఇలానే శిక్షించాలి..’’ ‘‘ పాపం.. తప్పు చేస్తే పోలీసులకు పట్టించాలి కానీ, ఇలా ఘోరంగా అవమానిస్తారా?’’.. అంటూ భిన్న కామెంట్లు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు