మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల సంఖ్య పెరగాలి

26 Sep, 2021 09:41 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. కనీసం 600  మెడికల్‌ కాలేజీలు, 50 ‘ఎయిమ్స్‌’ తరహా సంస్థలు, 200 సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ కావాలని అన్నారు. ప్రతి తాలూకాలో కనీసం ఒక వెటర్నరీ ఆసుపత్రి ఉండాలన్నారు.

ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. గడ్కరీ శనివారం మహా రాష్ట్రలో సతారా జిల్లాలోని కరాడ్‌లో కోవిడ్‌–19 మహమ్మారిపై పోరాడిన యోధులను సన్మానిం చారు. దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులను నెలకొల్పేందుకు సహకార రంగం కూడా ముందు రావాలని పిలుపునిచ్చారు.  

మోదీతో సంభాషణను గడ్కరీ ప్రస్తావించారు. కరోనా తొలినాళ్లలో 13వేల వెంటిలేటర్లుండేవి. దేశంలో వెంటిలేటర్ల కొరత ఉందని తాను చెప్పగా, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని మోదీ ప్రశ్నించారని, ఇప్పుడు భారీగా 2.5 లక్షల వెంటిలేటర్లు ఉండొచ్చని బదులిచ్చానని చెప్పారు.  

చదవండి: Speaker Om Birla: చట్టసభల గౌరవం పెంచాలి 

మరిన్ని వార్తలు