డైనమిక్‌ సీఎం యోగి జీ.. హ్యాపీ బర్త్‌ డే: మోదీ స్పెషల్‌ విషెస్‌

5 Jun, 2022 13:10 IST|Sakshi

నేడు (ఆదివారం) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈరోజు (జూన్ 5) సీఎం యోగి.. తన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో పలువురు ప్రముఖులు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం యోగికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఉతరప్రదేశ్ ముఖ్యమంత్రి, డైనమిక్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ జన్మదిన శుభాకాంక్షలు.. యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతమైన నాయకత్వంలో యూపీ ప్రగతి పథంలో కొత్త శిఖరాలకు చేరుకుంది. రాష్ట్ర ప్రజలకు ఆయన ప్రజానుకూల పాలన అందిస్తున్నారు. ప్రజాసేవలో ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలి’’ అని మోదీ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు అందించారు. 

ఇక, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు, పలువురు కేంద్ర మంత్రులు సీఎం యోగి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్‌లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూపీలో నేరాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు