Bella Ciao: ఇటాలియన్‌ పాట గుజరాతీ నోట.. లక్షల్లో వ్యూస్‌, వేలల్లో లైక్స్‌

26 Sep, 2021 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్ మనీ హీస్ట్ సిరీస్‌ 2 సినిమా గత నెల సెప్టెంబర్‌ 3న విడుదలైంది. ఈ సినిమా ఎంతలా అభిమానుల ఆదరణకు నోచుకుందో మనకు తెలుసు.  అత్యంత ప్రజాదరణ పోందిన ఈ క్రైమ్‌-థ్రిల్లర్‌ సినిమా హాలీవుడ్‌లో ఎప్పుడో వచ్చేసింది. ఈ సినిమా లోని బెల్లా సియావో పాట ప్రేక్షకులు మనస్సుకు ఎంతలా హత్తుకుందంటే ఈ పాట పాడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 

(చదవండి: జమ్ము కశ్మీర్‌లో భారత వైమానిక దళ విన్యాసం)

బెల్లా సియావో అంటే  సాహిత్యపరమైన అర్ధం అందమైన అమ్మాయికి వీడ్కోలు. ఇది ఇటాలియన్ జానపద కథ,  1943 లో ఇటాలియన్ అంతర్యుద్ధం సమయంలో పాడారు. 1945 లో ఫాసిస్ట్ ఇటాలియన్ సోషల్ రిపబ్లిక్  నాజీ జర్మన్ మిత్రరాజ్యాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇటాలియన్ పక్షపాతాలు ఈ పాట ఆలపించారు.

ఈ ఇటాలియన్‌ పాటను పంజాబీ, బిహార్‌ వంటి అనేక భారతీయ భాషల్లోకి అనువదించారు. ప్రస్తుతం ఈ పాటను  దేశీ హార్మోనియం, తబలా, మంజీరాపై గుజరాతీ యాసలో పాడారు. ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఇది నెటిజన్లు ఎంతగా ఆకర్షించిందటే లక్షల్లో వ్యూస్‌, వేలల్లో లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: పుట్టిన తేదీ ఉంటేనే విదేశాలకు పయనం)

మరిన్ని వార్తలు